ఈనెల 25న సత్యాగ్రహ దీక్ష

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 25న ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు శనివారం కోదాడలో బీసీ యువజన సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.