ప్రజలకు తులం బంగారం ఇవ్వాలి: వేముల ప్రశాంత్

NZB: బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 157 వివాహ ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రజలకు తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా అందించాలని ఆయన కోరారు.