హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌తో చిన్నారులకు తల్లిపాలు

హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌తో చిన్నారులకు తల్లిపాలు

TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోటరీ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ద్వారా తల్లిపాలు లేని చిన్నారులకు పాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. పాశ్చురైజేషన్ చేసి భద్రపరిచిన తల్లిపాలను వైద్యుల సూచన మేరకు శిశువులకు ఇస్తున్నారని పేర్కొన్నారు. తల్లిపాలు ఇవ్వడం, స్వీకరించడం పూర్తిగా ఉచితమని తెలిపారు.