మైనారిటీ గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

CTR: జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 5,6,7,8 తరగతుల్లో అడ్మిషన్లకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆంజనేయరాజు తెలిపారు. మురకంబట్టు వద్ద ఉన్న మైనారిటీ బాలికలు, కడప జిల్లా రామాంజనేయపురంలోని బాలుర మైనారిటీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.