'మున్నేరు నిర్వాసితులకు పరిహారం చెల్లించండి'

'మున్నేరు నిర్వాసితులకు పరిహారం చెల్లించండి'

KMM: మున్నేరు సైడ్ వాల్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని మున్నేరు భూ నిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ శనివారం వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే సైడ్ వాల్ కాంక్రీట్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు.