ఇంటర్ ప్రథమలో 60 శాతం ఉత్తీర్ణత
WNP: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో జిల్లాలో 6,219 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,762 మంది ఉత్తీర్ణులు అయ్యారని డీఐఈవో అంజయ్య తెలిపారు. వీరిలో బాలురు 1,464 మంది, బాలికలు 2,298 మంది ఉండగా.. 60 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. వృత్తి విద్యలో 69.13 శాతం నమోదైందన్నారు. కాగా, ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి అని ఆయన వెల్లడించారు.