రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
BHNG: మొయినాబాద్‌లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భవిష్యత్‌లో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకు రావాల్సిన అవసరం ఉందని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ మజీద్ తెలిపారు.