స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట రూ. 1.70 మోసం
కర్నూల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనపై సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు అందింది. కర్నూలు శరీన్ నగర్‌కు చెందిన యశోద, నందిని అనే యువతులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల పేరుతో ఉండవెల్లికి చెందిన సుధాకర్ రూ. 1.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.