రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: గురివిందగుంట గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి వేదికగా, రైతులకు సాగులో ఉన్న సమస్యలపై శాస్త్రీయ పరిష్కారాలు, కొత్త పంట రకాలు, దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.