రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
SKLM: ఎల్ ఎన్ పేట మండలం బొడ్డ వలస గ్రామంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఈ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు రాజ ముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. వెబ్ ల్యాండ్ వివరాలతో కూడిన ఈ కొత్త పాసు పుస్తకాలు రైతులకు పూర్తి భరోసా కల్పించనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ఉన్నారు.