రోడ్డు ప్రమాదం.. అన్నాచెల్లలకు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదం.. అన్నాచెల్లలకు తీవ్రగాయాలు

HNK: ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అన్నాచెల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వివరాల మేరకు నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన కల్లూరి రాకేశ్, శిరీషలు బైక్‌పై హనుమకొండకు వెళ్తున్న క్రమంలో నీరుకుళ్ల శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.