కర్నూలు కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు
KRNL: కర్నూలు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్‌కు DRO వెంకట నారాయణమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నగరంలో 258 పోలింగ్ స్టేషన్లలో గడువులోపు ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ పూర్తి చేయడంలో కమిషనర్ విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆమె పేర్కొన్నారు. 30% కూడా చేయలేదని, అందుకు కారణాలు తెలియజేస్తూ 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే చర్యలు ఉంటాయన్నారు.