83 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ
ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన 83 మంది లబ్ధిదారులకు సుమారు రూ.29 లక్షల విలువైన CMRF చెక్కులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఇవాళ ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి పంపిణీ చేశారు. మంత్రి పొంగులేటి కృషితో పాలేరు నియోజకవర్గానికి ప్రతి నెలా దాదాపు రూ.1 కోటి విలువైన సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరవుతున్నాయని చెప్పారు.