అనుమతులు లేకుండా పాఠశాల నిర్మాణం

అనుమతులు లేకుండా పాఠశాల నిర్మాణం

ADB: బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా నూతనంగా నిర్మిస్తున్న పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండనే పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.