గీతంలో 26న ‘యూత్ పార్లమెంట్’
VSP: కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 26న గీతం యూనివర్సిటీలో జిల్లా స్థాయి ‘యూత్ పార్లమెంట్’ నిర్వహించనున్నారు. 25 ఏళ్ల లోపు యువత ఇందులో పాల్గొనవచ్చు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గెలిచిన విజేతలు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు 8074605109, 9963332363 నంబర్లను సంప్రదించవచ్చు.