VIDEO: ఉరుములు మెరుపులతో భారీ వర్షం
MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, గౌతాపూర్, గుండేడు, కేతిరెడ్డిపల్లి, బోడ జానంపేట, నందారం తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ అకాల వర్షం వల్ల వేరుశనగ, వరి కోతలకు ఆటంకం కలిగింది. అటు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.