భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఊరేగింపు
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి హంస వాహనంపై స్వామివారి ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.