'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే
KRNL: మాస్‌మాన్ దొడ్డిలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి పాల్గొని, ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతానికి కృషి చేస్తున్నామని, రాయితీపై వ్యవసాయ ఉపకరణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.