అమృత భారత వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
W.G.కామాఖ్య నుంచి చర్లపల్లి వెళ్లే అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం తొలిసారిగా భీమవరం టౌన్ స్టేషన్ చేరుకుంది. ఈ సందర్భంగా కూటమి నాయకులు రైలుకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, MLA పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు జిల్లా వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.