అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌లో చేరికలు
ASF: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీసీసీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలం బీఆర్ఎస్ నాయకులు అన్నపూర్ణ అరుణ, మురళిలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.