రేపు జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు

VZM: రేపు జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని జిల్లా పరిషత్ సిఈవో బీవీ సత్యనారాయణ సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విజయనగరం పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 1,7 స్థాయి సంఘాల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది హాజరు కావాలని ఆయన కోరారు.