VIDEO: భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు

WGL: రాయపర్తి మండల కేంద్రంలో కుల మతాలకు అతీతంగా మొహర్రం పండుగను ఆ ప్రాంత ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పీర్లను సుందరంగా అలంకరించి మేళ తాళాల నడుమ గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముజావర్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ ఐకమత్యానికి, ధర్మ పరిరక్షణకు ప్రతిరూపమైన మొహర్రంను స్పూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు.