పెద్దమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ఆలయ అర్చకులు శుక్రవారం పంచామృతాలతో అభిషేకం చేసినట్లు ఆలయ ఈవో రజిని కుమారి తెలిపారు. మేళతాళాలతో జన్మస్థలం వద్ద ఉన్న అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు హారతి సమర్పించి పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం మూల విరాట్‌కు పంచామృతాలతో అభిషేకం చేశారు.