'అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి'
NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, 'మొంథా' తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం రాత్రి అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.