ఈనెల 30న బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు
MNCL: బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 30న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి నిర్వహించనున్న బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా రవికుమార్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కుమార్, సునీల్ కుమార్, మిగతా అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అసోసియేషన్‌లో 58 ఓట్లు నమోదయ్యాయని వెల్లడించారు.