VIDEO: అనపర్తి-రాజానగరం రహదారిలో కుప్పకూలిన వృక్షం
E.G: అనపర్తి-రాజానగరం ప్రధాన రహదారిలో భారీ వృక్షం కుప్పకూలింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా అనపర్తి GBR కళాశాలలోని భారీ వృక్షం రోడ్డుపైకి నేలవారింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్ అధికారులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో చెట్టును తొలగించి, రాకపోకలు పునరుద్దరించారు.