పెదబయలులో ప్రత్యేక విద్యా కార్యక్రమం

పెదబయలులో ప్రత్యేక విద్యా కార్యక్రమం

ASR: పెదబయలు మండలం పెదగొందిలో 'ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ' (CEO మన్మధరావు) ఆధ్వర్యంలో పాఠశాల లేని గ్రామాల్లోని ఆదివాసి పిల్లల కోసం ప్రత్యేక విద్యా కార్యక్రమం ప్రారంభమైంది. చదువుకు దూరమైన పిల్లలకు మాతృభాషలో, స్నేహపూర్వక వాతావరణంలో విద్యనందించడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్టి చిట్టిబాబు, హెచ్.ఎం గంగభావని పాల్గొన్నారు.