పరిశ్రమల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన
VZM: పరిశ్రమల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన ఉండాలని దేవుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కోట్ల ఎల్లంనాయుడు అన్నారు. సోమవారం 9, 10వ తరగతుల విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా టైలరింగ్ షాపులో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఒకేషనల్ విభాగం ఉపాధ్యాయురాలు రాణి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.