నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నెల్లూరు: నాయుడుపేట పట్టణంలో నేడు విద్యుత్ సరఫరా ఉండదని డీఈఈ శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని పేపర్ మిల్ ఫీడర్ లైన్లు మెయింటినెన్స్ కోసం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు బాలాజీ గ్రీన్ సిటీ, BMR నగర్, లోతువాణిగుంట, పాత బీడీ కాలనీ, కొత్త బీడీ కాలనీ గిరిజన కాలనీలలో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.