VIDEO: మరో రెండు మృతదేహాలు లభ్యం
ASR: ఎటపాక మండలం సరిహద్దున గోదావరిలో మునిగిపోయిన మరో ఇద్దరి మృత దేహాలను శనివారం ఉదయం ఈతగాళ్లు బయటకు తీశారు. గోదావరిలో శుక్రవారం స్నానం చేసేందుకు దిగిన అయిదుగురు యువకులు గల్లంతు అయిన విషయం విధితమే. నిన్న సాయంత్రం ముగ్గురు డెడ్ బాడీస్ బయటకు తీయగా, ఇవాళ తెల్లవారుజాము నుంచి ప్రత్యేక బృందాలు గాలించి సతీష్ కుమార్, తేజజ్ఞ సాయి మృతదేహాలను బయటకు తీశాయి.