VIDEO: పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం
GDWL: ఉండవెల్లి మండలం, పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి 44పై ప్రమాదం ఇవాళ జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మారుతి స్విఫ్ట్ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రోడ్డుపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.