గోవును కాపాడిన మున్సిపల్ సిబ్బంది
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి డ్రైనేజీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన ప్రజలు వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది గోమాతను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గోమాతను తరలించారు.