నేతన్న భరోస, భద్రత పథకాలకు దరఖాస్తు చేసుకోండి

MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళి శాఖ సంచాలకుడు బాబు గురువారం తెలిపారు. నేతన్న భరోసా పథకం కింద నమోదైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.18,000,అనుబంధ కార్మికులకు రూ.6,000 ఇస్తుందన్నారు. చేనేత కార్మికులు ఆగస్టు 5వ తేదీలోగా జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.