ఇనుకుర్తి మధ్య రాకపోకలు బంద్

ఇనుకుర్తి మధ్య రాకపోకలు బంద్

కృష్ణా: దిత్వా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు పొదలకూరు మండలంలోని ముదిగేడు - ఇనుకుర్తి మధ్య నున్న వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముదిగేడు - ఇనుకుర్తి గ్రామాల మధ్య రెండు రోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. ఎవరైనా వాగులో దిగుతారనే ఉద్దేశ్యంతో వాగు దాటకుండా పోలీస్, రెవిన్యూ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.