నేడు ఉచిత మెగా రక్తదాన శిబిరం
ASR: కొయ్యూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10:00కు ఎంపీడీవో కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఎంపీడీవో ప్రసాదరావు కోరారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలు అవుతారని ఎంపీడీవో తెలిపారు.