వీధుల్లో కుక్కల బెడద.. SDPI ఆందోళన

వీధుల్లో కుక్కల బెడద.. SDPI ఆందోళన

NDL: అసెంబ్లీ పరిధిలో వీధికుక్కల బెడద భయానకంగా మారింది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్డుపై నడవలేని పరిస్థితి ఏర్పడిందని మంగళవారం SDPI అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ మజీద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన ఘటనలతో ప్రజల్లో ఆందోళన పెరిగిందని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ వెంటనే స్టెరిలైజేషన్, కుక్కల రక్షిత కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.