VIDEO: బాధితులను పరామర్శించిన కవిత
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడటంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను వెంటనే ఆదుకుని, వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.