ఉరేసుకొని ఆటో డ్రైవర్ మృతి

ఉరేసుకొని ఆటో డ్రైవర్ మృతి

SKLM: సోంపేటలోని హోండా షోరూం వెనుక జీడీ తోటలో సోమవారం ఆటో డ్రైవర్ ధర్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన సోంపేట గాంధీనగర్ స్ట్రీట్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు గల కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సోంపేట ఎస్సై లవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.