ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురం పట్టణంలో ఎలక్ట్రికల్ సూపరింటెండింగ్ ఇంజనీరు వారి కార్యాలయ నూతన భవనానికి సోమవారం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, ఆముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, పెచ్చెట్టి విజయలక్ష్మి పాల్గొన్నారు.