రెండేళ్లలో వైద్య కళాశాలలు పూర్తి: సీడాప్ ఛైర్మన్
AP: PPP ద్వారా రెండేళ్లలో వైద్య కళాశాలలు పూర్తి చేస్తామని సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి అన్నారు. YCP విధానంలో అయితే ఇదే పని 15-20 ఏళ్లు పడుతుందని తెలిపారు. PPP విధానంలో మెడికల్ సీట్లు 500 నుంచి 1750కి పెరుగుతాయని చెప్పారు. ఈ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు.