గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

నెల్లూరు: మర్రిపాడు మండలం చుంచులూరు జాతి రహదారి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి కడప జిల్లా కాజీపేటకు చెందిన వలస కూలి సురేష్ గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.