రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

W.G: పెనుగొండ మండలం వడలిలో జరుగుతున్న అభివృద్ధి పనులను MLA పితాని సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. రూ. 50 లక్షలతో చేపట్టిన సుబ్బారాయుడు పుంత రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో గ్రామస్థుల సహకారం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.