VIDEO: పూజారి ఇంట్లో చోరీ
NLR: ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలోని ఓ పూజారి ఇంట్లో చోరీ జరిగింది. కృష్ణ మందిరం పూజారిగా ఉన్న రామ్మూర్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి 5 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు ఆయన తెలిపాడు. దీంతో వృద్ధులైన పూజారి దంపతులు కన్నీటి పర్యంతమై జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.