విజయవాడ- బెంగళూరుకు వందేభారత్ నడపాలి

NTR: విజయవాడ-బెంగళూరు మార్గంలో వందేభారత్ రైలు నడపాలని ప్రయాణికులు రైల్వే శాఖను కోరుతున్నారు. ప్రస్తుతం నేరుగా వెళ్లే రైలు లేకపోవడంతో శేషాద్రి, ప్రశాంతి, సంఘమిత్ర రైళ్లు కిటకిటలాడుతున్నాయి. వందేభారత్ నడిపితే ఈ ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు స్పందించాలని వారు కోరారు. ఈ మార్గంలో వందేభారత్ నడవడం లేదని RTI దరఖాస్తుకు రైల్వేశాఖ బదులిచ్చారు.