ఘనంగా జాతీయ బాలల దినోత్సవం

ఘనంగా జాతీయ బాలల దినోత్సవం

PPM: నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇది పిల్లల పండుగ, ప్రతీ రోజు సంతోషంగా ఉండాలన్నారు.