VIDEO: 'ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జి'

ప్రకాశం: మార్కాపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీ 2కు వెళ్ళే రహదారిలో బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. సుమారు 45 అడుగుల వెడల్పు కలిగిన రోడ్డుకు తాత్కాలికంగా సిమెంట్ రింగులు వేసి మట్టిని కప్పి ఉంచారు. దీంతో వర్షం పడి రోడ్డు సగం భాగం వరకు మట్టి కొట్టుకుపోయింది. కాలనీకి వెళ్లే ఆటోలు వాహనదారులు ప్రమాదం పొంచి ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు.