మెప్మా వార్షిక సంచికను విడుదల చేసిన కలెక్టర్
ELR: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెప్మా 2024-2025 వార్షిక సంచికను కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారికకు కృషి చేస్తుందన్నారు. మహిళలు నిరుపేదలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.