మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ
BHPL: సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న మైనింగ్ స్టాఫ్ సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ పాషా డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని కొమురయ్య భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి రావాల్సిన పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.