జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్

ELR: జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. విజిబుల్ పోలీసింగ్ మరియు డ్రంక్ & డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరగకుండా వాహన తనిఖీలు నిర్వహించారు. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడిపితే వారికి మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు.