గుంత రూపంలో పొంచి ఉన్న ప్రమాదం
KNR: సైదాపూర్-మొలంగూర్ ప్రధాన రహదారిపై సోమారం ఆదర్శ పాఠశాల సమీపంలోని సోమేశ్వర కుంట మత్తడి నీటి ప్రవాహం కారణంగా రోడ్డు మధ్యలో భారీ గుంత పడింది. ఈ గుంత వాహనాలు దగ్గరికి వచ్చేదాకా కనిపించకుండా ఉండటంతో ప్రమాదకరంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి, ప్రమాదాలు జరగకుండా గుంతను పూడ్చివేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.